ఏమని చెప్పను.. వీచే చిరుగాలి స్పర్శకు ఉరిమే ఆ మేఘం కరిగి చిరు జల్లుగా ఎలా కురిసిందంటే ???
ఏమని చెప్పను..శ్వేత వర్ణ రవికిరణం ఆ జల్లులో తడిసి ఏడు రంగుల హరివిల్లు గా ఎలా మారిందంటే???
ఏమని చెప్పను..శ్వేత వర్ణ రవికిరణం ఆ జల్లులో తడిసి ఏడు రంగుల హరివిల్లు గా ఎలా మారిందంటే???
ఏమని చెప్పను..కరిగిన ఆ మేఘం కడలిని ఎలా చేరిందంటే ..మరల తిరిగి ఎలా మేఘం అయ్యిందంటే???
ఏమని చెప్పను.. ఒక చిన్ని చిరునవ్వుతో మొదలైన మన స్నేహం ఇంత తీపినెలా పంచిందంటే???
ఏమని చెప్పను.. నీ చేయి దూరమైన క్షణం నా కంట గంగ ఎందుకు పొంగిందంటే???
ఏమని చెప్పను.. నీ తలపులు నిండిన నా హృదయం ఈ దూరాన్ని మధురమెలా చేసిందంటే???