వో నేస్తమా
నిశిలా మారిన మనసుకి
ఉషోదయంలా పరిచయం అయ్యావు
శిలగా మిగిలిన మనిషిని
నీ ప్రేమతో కరిగించావు
కలలన్నవి ఎరుగని కనులకి
కలలలోకాలను కానుక చేసావు
చిరు నవ్వే తెలియని పెదవికి
దరహాసం అంకితం ఇచ్చావు
ఆశన్నది పుట్టని గుండెలో
చిగురాశల అలజడి రేపావు
నేస్తమా
నీ తలపులతో నిండిన మనసుకి
సందెవేల సూర్యునిలా దూరం అయ్యావు
ఎడబాటును శిక్షగా వేసావు
నా గమనం నరకం చేసావు
కలలన్ని కల్లలు చేసావు
కన్నీటిని మిగిల్చావు
చిరునవ్వులు చేరిపెసావు
చీకట్లో వదిలేశావు
చిగురాశలు తుడిచేసావు
నిరాశనే మిగిల్చావు
నేస్తం
నీ కోసం తపించే నా కోసం
ఉదయించే రవిలా వచ్చి
మరు జన్మకైనా చేరుకుంటావని నా నిరీక్షణ ......
నా మొదటి కవిత. దూరమైన స్నేహితురాలి కోసం రాద్దామని మొదలుపెడితే , విరహగీతం లా మారిపోయింది :D
ReplyDeleteకింద మీ వ్యాఖ్య తీసేస్తే విరహ కవితలానే ఉంది.
ReplyDeleteమా స్నేహితులలో ఒకరితో విరోధం తరువాత ఇది రాశా http://pradeepblog.miriyala.in/2009/02/blog-post_10.html
(ఇక్కడ నా బ్లాగుకి ప్రచారం ఇవ్వడం, బహుశా అసంధర్భం కావచ్చు ;).
but I'm so much tempted to give so. Ignore if u feel really irrelevant)