వో నేస్తమా, నాతో కలిసి నడు
ఏనాడూ నేనాగాను,ఏది నాకు అడ్డంకాబోదు
నీ భవిత ను నే చూపిస్తాను, నాతో కలిసి నడు
కొత్త అవకాసాలను నీ ముందు ఉంచుతాను
పాత బాధలను మరపిస్తాను
నీ విజయాలను మధుర స్మ్రుతులుగా మారుస్తాను
నీ అపజయాలను గుణపాఠాలు గా గుర్తుకు తెస్తాను
నీ ప్రతి కష్టం లో తోడుంటాను,
నీ ప్రతి సుఖాన్ని పంచుకుంటాను
నీ ఆశయ సాధనకు ఉపయోగపడతాను
నీ విజయానికి సాక్షి ని అవుతాను
నన్ను పూర్తిగా నీకు కానుక చేస్తాను, నాతో కలిసి నడు
బదులేది అడగను నేస్తం
కాని నీ కోసం ఆగమని మాత్రం నన్ను అడగకు
నా పేరు కాలం
( నూతన సంవత్సర శుభాకాంక్షలు )
కాలమే నేస్తమైతే స్వప్నమే వాస్తవమై స్వప్నలోకం సాక్షాత్కరిస్తుంది...
ReplyDelete